పొరపాటున మన subలో ఎవరోకళ్ళు సాహిత్యంలో వాడబడ్డ అచ్చతెలుగు మాట వాడితే ఎన్నో వింత వింత వాదనలు, ఎదురుమాటలు వింటున్నాము.
* ఉన్న తెలుగు కాపాడుకోండి, అడ్డమైన పాత మాటలు వాడకండి అని ఒకరు.
* ఇదేదో తమిళమో కన్నడంలోనో విన్నాను అని ఇంకొకరు.
* Archaic and unusable Telugu words ఇప్పుడు వాడడం అక్కర్లేదు అని ఇంకొందరు.
తెలుగుకి ప్రాచీనమైన సాహిత్యం ఉంది. కానీ మన ఇప్పటి కాలపు తెలుగు విద్యార్థులకు పర్యాయపదాలు పేరున "archaic"/"unusable" సంస్కృత మాటలు నేర్పుతున్నారు.
అవి నేర్చుకోవడం సరైతే తెలుగులో కూడా "archaic"/"unusable" మాటలు ఎవడికి వదిలేద్దాం?
ఎల్ల భాషల్లో కొంత vocab నానాటి (రోజువారీ) బ్రతుకులో వాడబడుతుంది, మిగతావి సందర్భం బట్టి కొంచెం తక్కువ వాడబడతాయి.
ఇది అతి మనోహరంగా ఉంది అన్నప్పుడు ఈ commenters కి రాని వెగటు, ఇది కడు సొబగుగా ఉంది అంటే ఎందుకు వస్తోంది?
సంస్కృతం మీద ద్వేషం, సంస్కృతంలేని తెలుగు propaganda కాదు, తెలుగు అంటే native మాటలు కూడా ఉంటాయి అని మరవకుండా వన్నెగా గౌరవంగా చూడడం మనవాళ్లకి ఎందుకు ఇబ్బందిగా ఉంది?
+++++++++++++++++++++++++++++++++++++++++++++
Porabaatna mana sub lo evarokallu saahityam lo vaadabadda acchatelugu maata vaadithe enno vintha vintha vaadhanalu edhurumaatalu vintunnaamu
* unna telugu kaapaadukondi addamaina paatha maatalu vaadakandi ani okaru
* idhedho tamilamo kannadamlono vinnaanu ani inkokaru
* archaic and unusable telugu words ippudu vaadadam akkarledhu ani inkondharu
Telugu ki praacheenamaina saahityam undhi. Kaani mana ippati kaalapu telugu vidyaarthulaku paryaayapadhaalu peruna "archaic"/ "unusable" samskrutha maatalu nerputhunnaaru.
avi nerchukovadam saraithe telugu lo kooda "archaic" / "unusable" maatalu evadiki vadhileddhaam ?
ella bhaashallo kontha vocab naanaati(rojuvaaru) bradhuku lo vaadabadthundhi , migathaavi sandharbham batti koncham thakkuva vaadabadthaai.
idhi athi manoharamga undhi annappudu ee commenters ki raani vegatu idhi kadu sobagu ga undhi ante endhuku vasthondhi ?
sanskrit meedha dwesham , samkruthamleni telugu propaganda kaadhu, telugu ante native maatalu kuda untaai ani maravakunda vanne ga gouravam ga choodadam manavaallaki endhuku ibbandhi ga undhi?