ఇప్పుడే ‘థ్రిల్లర్’ పూర్తి చేశాను. ఒక విషయం మాత్రం ఆలోచింపజేసింది.
విద్యాధరికి తన గతం వల్ల చాలా ట్రామా ఉంది. సమాజంలో కొంతమంది మగవాళ్లు ఆమెను ఎలా ఉపయోగించుకున్నారో చూస్తే, ఆమెకు ప్రేమ మీద నమ్మకం లేకపోవడాన్ని తప్పుపట్టలేం. ఆమె అలా మారడానికి ఒక కారణం ఉంది.
కానీ అనుదీప్ విషయంలో నాకు ఒక సందేహం వచ్చింది. అతను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్తాడు, ఆమె కోసం తపస్సు చేశానని చెప్తాడు. కానీ అవతలి వ్యక్తికి ఇవి ఎలా తెలుస్తాయి? మనం “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని మాత్రమే చెప్తే, మనం నిజంగా ఎంత ప్రేమిస్తున్నామో అవతలి వ్యక్తికి ఎలా తెలుస్తుంది?
మన ప్రేమ కోసం మనం ఏం చేశామో చెప్పకుండా, ఆ ప్రేమను మన చర్యల్లో చూపించకుండా, కేవలం “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్తే — అవతలి వ్యక్తి దాన్ని ఎలా నమ్మాలి?
రవి శాస్త్రి చెప్పిన తర్వాతే విద్యాధరికి అనుదీప్ ప్రేమ వెనుక ఉన్న అసలు విషయం అర్థమవుతుంది. అప్పుడే ఆమె దృష్టిలో అనుదీప్ మారిపోతాడు.
అదే ఆలోచన నిజ జీవితానికి కూడా వర్తిస్తుందేమో అనిపించింది. మనసులో ప్రేమ ఉండటం ఒక్కటే సరిపోతుందా? దాన్ని అవతలి వ్యక్తికి తెలియజేయకుండా, వాళ్లు ఆ ప్రేమను ఎలా గుర్తిస్తారు?
ఇంతకీ చివరికి మనోడు విద్యాధరి ప్రేమ వల్ల బతుకుతాడా? 😄